కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిణామాలు వేగంగా మారుతున్నాయి.. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు తీవ్రస్థాయిలో ఎన్నికల పోలింగ్ సరళి.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ప్రధాన పార్టీల అభ్యర్థల దూకుడు వంటివాటిని నిశితంగా గమనిస్తున్నాయి. దీనిలో ప్రధానంగా వైసీపీ గురించి ఎక్కువగా చర్చకు వస్తోంది. ఈ పార్టీ అధినేత జగన్ ప్రస్తుతం విదేశాలకు వెళ్లినా ఐప్యాక్ టీం మాత్రం పనిలోనే ఉంది. ఈ టీం.. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ను విశ్లేషిస్తోంది. అదేసమయంలో ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను కూడా అంచనా వేస్తోంది. దీని ప్రకారం.. తాము అంచనా వేసుకున్న దానికంటే కూడా ఎక్కువగా పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు.. అక్కడి సామాజిక వర్గాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. వైసీపీని ప్రభావితం చేసిన అంశాలతోపాటు.. కూటమి పార్టీల వ్యవహారాన్ని కూడా.. లెక్కలు వేస్తోంది.
ఈ క్రమంలో జూన్ 4 తర్వాత ఆయా నియోజకవర్గాల్లోపరిణామాలను అంచనా వేసి.. అక్కడి నేతలపై చర్యలకు దిగే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఉదాహరణకు ఎన్నికలకు ముందు సుమారు 35 మంది పైగా.. నాయకులను ఎన్నికలకు దూరం పెట్టారు. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీ నుంచి టికెట్ దక్కని నాయకులు.. పార్టీ కోసం పనిచేశారా..? లేక.. తమకు ఎలానూ టికెట్ రాలేదని.. పొరుగు పార్టీకి అనుకూలంగా సామాజిక వర్గాల పరం గా చక్రం తిప్పారా? అనే విషయంపై ఐప్యాక్ సర్వే చేస్తోంది. దీనిలో కనుక ఎలాంటిఫలితం వచ్చినా.. రేపు జూన్ 4న వచ్చే తుది ఫలితం ఆధారంగా వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
వీరిపై చర్యలు నేరుగా కాకుండా వారికి ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం ఖాయమని తెలుస్తోంది. అదేస మయంలో పార్టీలో ఉంటూ.. సామాజిక వర్గాలపరంగా ప్రభావితం చేసి.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉదాహరణకు గంగా ధర నెల్లూరు నియోజకివర్గం లో కృపాలక్ష్మికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు అంతర్గత క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు వీరిని గుర్తిస్తు న్నారు. అదేవిధంగా సీమలోనూ.. కొందరు కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేశారు. దీంతో ఇలాంటి వారిపై చర్యలు తప్పవనట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.