మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. నేహా శెట్టి , అంజలి హీరోయిన్స్ గా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మరీ సినిమా ఎలా ఉంది…? విశ్వక్ సేన్ ఖతాలో మరో హిట్ పడిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
1990 రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథాంశంతో రూపొందిన సినిమానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమ స్టోరీ విషయానికి వస్తే… చీకటి ప్రపంచంలో ఉన్న రత్న.. జీవితంలో ఎంతో కష్టపడి టైగర్ రత్న అనే ఒక పొలిటీషిన్ గా ఎదుగుతాడు. ఆ ఊరిలో రత్నా చెప్పిందే జరుగుతుంది. ఓటర్లను తన దగ్గరున్న నోట్లతో కొనేస్తుంటాడు. ఎవరూ టైగర్ రత్నాకు ఎదురు చెప్పాలి అనుకోరు. చెప్పిన వాడు అలా మిగిలిపోడు. ఇలాంటి మొండోడు రాజకీయాల్లోకి వస్తే.. సాధారణంగానే మిగిలిన వాళ్లు తట్టుకోలేరు. అలాగే టైగర్ రత్నా అంటే పడని వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇదే గ్యాప్ లో లవ్ స్టోరీ కూడా ఉంటుంది..? అయితే సామాన్యుడిగా ఉన్న రత్న నాయకుడిగా ఎలా ఎదుతాడు..? రత్నను చంపాలనుకున్న వాళ్లను ఏం చేస్తాడు.. అన్నది తెలియాలంటే థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే… గ్యాంగ్ ఆఫ్ గోదావరి… గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ, నిజానికి ఆ ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయనేది దర్శకుడు సినిమాలో చూపించాడు. ఫస్టాప్ మొత్తం కొంత కామేడీ, లవ్, సింపుల్ పైట్ల తో సాగుతోంది. ఇంటర్వేల్ తర్వాత అసలైన యాక్షన్స్ సీన్స్ ఉంటాయి. విశ్వక్ సేన్, నేహల మధ్య లవ్ ట్రాక్ బాగుంటుంది. ఇక అంజలితో విశ్వక్ సేన్ సీన్ అదరగొట్టారు. ఈ సినిమాలో వయొలెన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ కావాల్సినంత ఉన్నాయి. ఒక యారగెంట్, యాటిట్యూడ్ ఉన్న యాంగ్రీ యంగ్ మ్యాన్ చేతికి పవర్ దక్కితే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని డైలాగ్స్ రూపంలో చూపించడంలో దర్శకుడు కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యారు. తను ప్రేక్షకులకు ఏదైతే చూపించాలి అనుకున్న ఆ అవుట్ వచ్చింది. ఈ సినిమాలో పాటలు కూడా అదిరిపోయాయి. ప్రతి పాట కూడా సందర్భాన్ని బట్టి వచ్చాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హిట్ అయ్యింది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్. సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్రామీణ యాక్షన్ డ్రామా అని చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే… ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ విశ్వరూపం అయితే కన్ఫామ్ గా కనిపిస్తోంది. లంకల రత్న అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్ సేన్ మెప్పించాడు. తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రకు నిండుదనం తీసుకొచ్చాడు. లంకల రత్న పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇక హిరోయిన్ నేహ శర్మ… బుజ్జి అనేది 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్ర. అందంగా కనిపిస్తూనే, ధృడంగా ఉండే పాత్ర ఇది. పాత్రకు నేహ శేట్టి వందశాతం న్యాయం చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అంజిలి నటించారు. అంజలికి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆమె కూడా తన క్యారెక్టర్ తో మెప్పించింది. ఇక మిగతా నటీనటులు సాయి కుమార్, గోపరాజు రమణ, అయేషా ఖాన్, హైపర్ ఆది తమ పాత్ర ల మేరకు నటించారు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాకు నటీనటుల యాక్షన్, డైరెక్షన్, మ్యూజిక్, ప్లస్ పాయింట్స్ కాగా.. ఓవర్ వైలెన్స్, స్టోరీ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి… ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి గ్యాంగ్ ఆఫ్ గోదావరి బెస్ట్ ఛాయిస్.