గత ఏడాది బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే జోష్ తో ఆనంద్ దేవరకొండ గం గం గణేశా లో నటించాడు. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించగా.. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి, వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. కానీ రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు గం గం గణేశా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆనంద్ దేవరకొండకు మరో హిట్ పడిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
గం గం గణేశా సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హిరో ఆనంద్ దేవరకొండ జూలాయిగా తిరుగుతూ.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి ఓ ఛాలెంజ్ ఎదురవుతోంది. ఆ ఛాలెంజ్ ఏంటి..? ఓ పొలిటీషియన్, రాజావారు, విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకునే బ్యాచ్ హీరో జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత అతనికి వీళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేశారు అనేది సినిమా స్థోరీ.. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. గం గం గణేశా సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. మంచి కామెడీ ఎంటర్ ట్రైనర్. ఈ సినిమా కామెడీ తోనే మొదలవుతోంది. ఇంటర్వేల్ తర్వాత ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉంటాయి. వెన్నెలకిషోర్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ మధ్య కామెడీ సూపర్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమా కావాల్సినంత రోమాన్స్ కూడా ఉంటుంది. ఎక్కడ చిన్న బోర్ అనిపించదు. ఫ్రెండ్స్ లలో ఒకరు మనల్ని ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో జనరేట్ అయ్యే కామెడీ బాగా నవ్విస్తుంది. గం గం గణేశా సినిమా కామెడీతో పాటు కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. సినిమా క్లైమాక్స్ అల్టిమేట్ గా ఉందని తెలిపారు. కామెడీ, యాక్టింగ్, సస్పెన్స్ తో పాటు ఓవరాల్ మూవీ చాలా బాగుందంటున్నారు.
ఉదయ్ శెట్టి కొత్త దర్శకుడు అయిన… ఆ చాయలు సినిమాలో కనిపించలేదు. పాయింట్ టూ పాయింట్ క్లియర్ తీశాడు. క్రైమ్ కామెడీ జానర్ లో కథలు చెప్పినంత బాగా దర్శకులు తీయలేరు. కానీ గం గం గణేశాను కథ నెరేషన్ కంటే బాగా తెరకెక్కించాడు ఉదయ్. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. పాటలతోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మొత్తంగా గం గం గణేశా అంటే రోమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆనంద్ దేవకొండ లుక్ ఈ సినిమాలో చాలా డిఫారెంట్ గా ఉంటుంది. ఒక కొత్త ఆనంద్ కనిపిస్తాడు. హిరో పాత్రకు సమర్థవంతంగా న్యాయం చేశాడు ఆనంద్ దేవరకొండ. ఇద్దరు హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి పర్ ఫార్మెన్స్ చేశారు. వీళ్లిద్దరి పాత్రలకు స్కోప్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ అద్భుతంగా నవ్వించాడు. ఇక ఈ సినిమాకు డైరెక్షన్, స్టోరీ, హిరో యాక్షన్, కామెడీ ప్లస్ పాయింట్స్ కాగా.. ఓవర్ రోమాన్స్ మైనస్ గా చెప్పాలి. గం గం గణేశా ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులకు నచ్చే చిత్రం.. ఓవరాల్ గా చెప్పాలంటే.. రెండున్నర గంటలు నవ్వుకోవడం పక్కా..